Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంతో మంది రాజకీయ నాయకులను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వర్ రావును సైతం అలానే మోసం చేశారన్నారు. తుమ్మల బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఈటల స్పష్టం చేశారు.
విపక్ష ‘ఇండియా’ కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కూటమిలో ఏయే పార్టీలు చేరబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సీట్ల పంపకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.
సీఎం కేసీఆర్పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు.
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాలను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.