Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు
ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు.