Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!
పూసల వాళ్ళ వృత్తి ఒకప్పుడు గొప్పగా ఉండేదని.. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతి లేక ఈ పని చేస్తున్నారన్నారు. భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని.. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదన్నారు ఈటల. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు ఈటల.