Bigg Boss 7 Telugu: అందరి ముందు ఏడవలేకపోతున్న.. ఎమోషనల్ అయిన శివాజీ ..!
బిగ్ బాస్ సీజన్ 7 గులాబీపురం, జిలేబీపురం ఈ టీమ్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ 4 లెవెల్స్ లో జరిగింది. జరిగిన 4 లెవెల్స్ లో జిలేబీపురం టీం ఎక్కువ టాస్క్ లు విన్ అవ్వడంతో ఆ టీం సభ్యులైన ప్రియాంక, శివాజీ , సందీప్, అర్జున్, అశ్విని, ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. కానీ ఈ ఆరుగురిలో ఎవరు కెప్టెన్సీ రేసులో ఉండాలి అని డిసైడ్ చేసేది మాత్రం ఓడిపోయిన గులాబీపురం టీం సభ్యులు. ఇక ఈ టాస్క్ లో గులాబీపురం సభ్యులు పలు కారణాలు చెప్పి ప్రియాంక, ప్రశాంత్, అశ్విని, శివాజీని రేసు నుంచి తొలగించారు. ఇక చివరిలో మిగిలిన సందీప్, అర్జున్ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నట్లు బిగ్ బాస్ తెలిపారు.