Bigg Boss 7 promo 2: ప్రశాంత్ ని అనే అర్హత ఎవ్వరికీ లేదు.. అశ్విని షాకింగ్ కామెంట్స్..! బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పోటీదారులుగా నిలిచిన శోభ, యావర్, గౌతమ్, సందీప్, ప్రశాంత్, ప్రియాంక.. ఈ ఐదుగురిలో ఎవరు కెప్టెన్ అనే విషయంలో ఇంటి సభ్యుల మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. By Archana 27 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7 promo: బిగ్ బాస్ ఇంట్లో ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో శోభ, గౌతమ్, ప్రియాంక, సందీప్, ప్రశాంత్ పోటీపడుతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ విషయంలో ఇంటి సభ్యులంతా రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.. దీంతో బిగ్ బాస్ ఇల్లంతా ఇంటి సభ్యుల వాదనలతో వేడెక్కినట్లు కనిపించింది. పై ఐదుగురిలో కెప్టెన్ గా అర్హత లేని వారి మెడలో మిర్చీ దండ వేసి వారిని రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్ లో భాగంగా రేసు నుంచి ఒకరిని తప్పించడానికి వచ్చిన అశ్విని.. ప్రశాంత్ అనర్హుడని చెప్పే అర్హత ఇంటి సభ్యులెవరికీ లేదు అంటూ ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇక్కడ అశ్విని మాట్లాడిన మాటలకు తేజ స్పందిస్తూ.. ప్రశాంత్ ని అనడానికి ఇక్కడ ఎవ్వరికీ అర్హత లేదని అన్నావు.. అసలు మాకు అర్హత లేదని చెప్పడానికి నువ్వెవరు అంటూ వాదించాడు. ఆ తర్వాత వచ్చిన అమర్ ప్రశాంత్ మెడలో దండ వేస్తూ.. పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి అని చెప్పి అనర్హుడిగా ప్రకటించాడు. అంటే ప్రశాంత్ ఇదివరకే కెప్టెన్ అయ్యాడు.. కావున ఈ సారి ఇతరులకు అవకాశం ఇవ్వమన్నట్లుగా అమర్ మాటలు ఉన్నాయి. మళ్ళీ తేజ కూడా వచ్చి ప్రశాంత్ నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యావు.. ఈ సారి మరొకరికి అవకాశం రావాలి.. ఆ ఒక్క కారణంతోనే నీ మెడలో ఈ మిర్చీ దండ వేస్తున్నానని చెప్పాడు. దానికి 'నా మెడలో ఈ మాల వేస్తుంటే మా రైతులు పండించిన పంట నా మెడలో పూల మాల అయినట్లుగా అనిపిస్తుందని తేజకు ఓ డైలాగ్ విసిరాడు రైతు బిడ్డ ప్రశాంత్. ఇక రతిక.. యావర్ పై శోభ చేసిన ఆరోపణల గురించి మాట్లాడుతూ.. పిచ్చోడా అనడం చాలా తప్పు.. అది తనకు చాలా బ్యాడ్ అవుతుందని యావర్ తో డిస్కషన్ మొదలు పెట్టింది. ఇటు తేజ వచ్చి శోభను కూల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ శోభ మాత్రం కాస్త చిరాకు పడినట్లు కనిపించింది. Also Read: Bigg Boss 7 Promo: నువ్వు పిచ్చోడివే .. మళ్ళీ మళ్ళీ అంటాను.. ఏం చేస్తావు..! #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo #bigg-boss-7-latest-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి