Air Asia Emergency Landing: ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..!!
ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం ఇక్కడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే తిరిగి వచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన కొచ్చి-బెంగళూరు విమానం రాత్రి 11.15 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత విమానంలో హైడ్రాలిక్ సమస్య ఉన్నట్లు గుర్తించారు.
ఆ రోజు ఎంతో దూరంలో లేదు.... హైదరాబాద్ పై ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్...!
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మ్యాట్రిమోనీలో పరిచయం..కోటి రూపాయలు మోసం!
ఓ మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన ఓ లేడీ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను బోల్తా కొట్టించింది. దాదాపు అతని వద్ద నుంచి రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bus-Sheltor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bus-stop.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/airasia-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/owaisi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/crime-jpg.webp)