Anti Aging Remedy: 40లో 25లా కనిపించాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి...!!
ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటారు. ముఖ్యంగా 40ఏళ్ల వయసులో 25ఏళ్లుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు, ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖానికి ఎప్పుడూ SPF 30 సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దుమ్ము లేదా UV కిరణాల నుండి రక్షించడమే కాకుండా, దానిని అప్లై చేయడం వల్ల మీ చర్మంపై ముడతలు కూడా రాకుండా నివారిస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు కూడా ఫోటోగింగ్కు కారణమవుతాయి. సన్‌స్క్రీన్‌ని అప్లయ్ చేయడం వల్ల మీరు వాటిని కూడా నివారించవచ్చు.