Ranji Trophy: రంజీ క్రికెటర్ల పంట పండింది.. ఇక సీజన్ కు కోటి?!
భారత దేశవాళీ క్రికెటర్ల నెత్తిన పాలు పోయాలని..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి రంజీట్రోఫీ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు భారీగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని భావిస్తోంది. సీజన్ కు 75 లక్షల నుంచి కోటి వరకూ..ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుంది.