Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు.