Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి కచ్చితంగా.. పార్టీ ఏమనుకున్నా సరే: ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కచ్చితంగా వెళ్తానన్నారు. నా విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు. ఇలాంటి పుణ్యకార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ వ్యాఖ్యానించారు.