Israel-Hamas conflict:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్
నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది.