TDP : ఉత్కంఠగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు.