Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేడి.. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రాజకీయ వేడి నెలకొంది. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కార్యక్రమాలను కార్యక్రమాలను చూసుకునేందుకు నలుగురు ఏఐసీసీ సెక్రటరీలను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓ ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.