యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!
స్టార్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతి, ఐశ్వర్య గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీరి నిశ్చితార్థ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.