Vizag News: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!
మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధి పై పూర్తి దృష్టిని పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ బస్సులు రోడ్లు పైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.