BREAKING: ఆర్కేకు షాక్ ఇచ్చిన సీఎం జగన్.. వైసీపీ సస్పెన్షన్
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని యువ లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ ఆర్ లా నేస్తం పథకం కింద నేడు లబ్దిదారుల అకౌంట్లో రూ. 30వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు యువ లాయర్ల అకౌంట్లో జమకానున్నాయి. ఏపీలోని 2,807మంది కొత్త లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతీ సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం కలిగింది అని ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వల్లే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓడిందని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందని అన్నారు. జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ఈ నెల 11న కేబినెట్ భేటీ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ నెల 14కు కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది
పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్. తెలంగాణలో ఫలితాలు చూసి పవన్ కు మతి భ్రమించినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం పెట్టుకున్నారని అన్నారు.
చిరుత సంచారం ఓ గ్రామాన్ని వణికిస్తోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చెర్లోపల్లిలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీచేశారు.
జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే అని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత లోకేష్. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు.