Pruthvi: లోకేశ్‌ది ఎర్ర డైరీ.. నాది పీఆర్ డైరీ.. అందరి జాతకాలు బయటపెడతా.. సినీనటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
తాను చంద్రబాబు, పవన్ వదలిన బాణాన్ని అన్నారు సినీనటుడు, జనసేన నేత పృథ్వీ. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ బాణం అని అది వైసీపీని ఏం చేస్తుందో చూడాలని అన్నారు. టీడీపీ, జనసేన కూటమి 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.