3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు ఇప్పటికే బీభత్సం సృష్టిస్తుండగా మొత్తంగా నలుగురు చనిపోయారు. తెలంగాణలో 5 జిల్లాలకు ఆరెంజ్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది.