Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు
ఏపీలో లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి.