AP Elections 2024: వైసీపీలోకి టీడీపీ కీలక నేత
ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. తాను ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేయడం లేదని.. పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తారని అన్నారు.
రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల లక్ష్యంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉంది.
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ముద్రగడ వైసీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఆయనతో కుమారుడు గిరిబాబు కూడా వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ.
ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ఈ మీటింగ్‌లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్ మాట్లాడే అవకాశముంది. మ.3గంకు ఈ సభ స్టార్ట్ అవుతుంది.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఫైర్ అయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పెడితే.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీలో జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశం కానున్నట్లు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.
ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తుండగా.. జనసేనానిపై పోటికి ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.