Nara Lokesh : లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏపీ సీఐడీ.. అడుగుతున్న క్వశ్చన్స్ లిస్ట్ ఇదే!
టీడీపీ మాజీ మంత్రి నారాలోకేశ్ ను తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10గంటలకు విచారణ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇద్దరు సభ్యుల సిఐడి బృందం విచారిస్తోంది. సీఐడి అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీ భాస్కర్ లోకేశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఐడీ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా మీకు తెలిసే జరిగిందా...ముందే సమాచారం ఉందా...డిజైన్ లో ఎందుకు మార్పులు చేశారనే ప్రశ్నలతో లోకేశ్ ను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు.