AP Bandh: ఈ నెల 24న ఏపీ బంద్.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అరెస్ట్ చేయడంతో పాటు ప్రభుత్వం అల్టిమేటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.