బంగాళా ఖాతంలో అల్పపీడం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్!!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.