BJP Politics: బీజేపీలో అసంతృప్తి జ్వాల.. అమిత్‌షాపై అలిగిన నేతలు.. ఎవరంటే?
తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పలువురు కీలక బీజేపీ నేతలు అలిగారు. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షాపై కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలను కలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ లిస్ట్‌లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.