Allu Arjun: నాగార్జునసాగర్‌పై అల్లు అర్జున్ కన్ను.. మామ కోసం అల్లుడి ప్రచారం
కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వస్థలం చింతపల్లిలో ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. రేపు సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈసారి మామ తరపున ప్రచారం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు కంచర్ల సిద్ధమైయ్యారు. క్షేత్రంలో నిర్మించిన ఆఫీస్, ఫంక్షన్ హాల్ ప్రారంభించేందుకు అల్లుడిని అక్కడికి రప్పిస్తున్నారు. అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.