Rishi Sunak: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి..!!
జి-20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఆదివారం అక్షరధామ్ ఆలయానికి చేరుకుని స్వామినారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం సందర్శకుల డైరీలో కొన్ని విశేషాలను రాసుకున్నారు. అక్షరధామ్ ఆలయ చిత్రాన్ని ఆయనకు ఆలయ కమిటీ జ్ఞాపికగా అందించింది.