Interim Budget 2024 : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..!
బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9వరకు సెషన్ జరుగుతుంది.