Actress Daksha Nagarkar Adimitted in Hospitel : టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నగర్కార్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికిదాకా ఓ సరైన హిట్ అందుకోలేక పోయింది. ఇన్నేళ్ల తన కెరీర్ లో కేవలం 5 సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ జాంబీ రెడ్డి, హుషారు, రావణాసుర వంటి సినిమాల్లో తన గ్లామర్ తో యూత్ ని ఆకట్టుకుంది.
ఆకట్టుకునే అందం, అభినయం ఉన్నా ఈ హీరోయిన్ కి అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దక్ష తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన హీరోయిన్
ఈ మధ్య తరచూ ఏదో ఓక ఈవెంట్ లో కనిపిస్తున్న దక్ష నగర్కార్ తాజాగా ఆస్పత్రి పాలైంది. ఇదే విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ” గడచిన కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైనవి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో పది ఉండటం ఎంతో కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండు సార్లు మత్తు మందు సూదులు గుచ్చారు. దాని నుంచి కోలుకోవడం మరింత కష్టం గా ఉంది”.
ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు
” నా ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకునేందుకు ఎంతగానో ట్రై చేశాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలబడ్డారు. ప్రేమ, కేరింగ్ కు కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. నా గురించి ఆనందకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు బాధపడకూడదు కాబట్టి” అంటూ తన పోస్ట్ లో తెలిపింది. ఇక దక్ష నగర్కార్ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
View this post on Instagram