బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు దుర్గా పూజా కేసులో కాస్త ఊరట లభించింది. 2018 నాటి చీటింగ్ కేసులో ఆమెకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ చీటింగ్ కేసులో.. రూ.30 వేల పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. అంతేకాదు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
అసలు విషయానికొస్తే.. 2018లో కోల్‌కతాలో జరిగిన దూర్గా పూజలో (Durga Puja) పాల్గొనేందుకు నిర్వహాకుల నుంచి జరీన్ ఖాన్ రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. కానీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. ఆగ్రహానికి గురైన నిర్వాహకులు జరీన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు పెట్టారు. ఇదే కేసులో జరీన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. సెప్టెంబర్ నెలలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఈ ఇష్యపై ఖాన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత రూ.30,000 వ్యక్తిగత బాండ్‌పై డిసెంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని, కోల్‌కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆంక్షలు విధించింది. జరీన్ ఖాన్ కోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.
Also read :వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
ఇక లుక్స్ పరంగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పోలికలతో ఉండే జరీన్.. ‘వీర్’ మూవీతో తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన ఈ చిత్రం ఫెయిల్ అయినా ఆమెకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 2’ ‘హేట్ స్టోరీ 3’ ‘అక్సర్ 2’ ‘1921’ ‘హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే’ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ ఆడిపాడింది. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంతో జరీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇదే క్రమంలో తమిళం పంజాబీ చిత్రాల్లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరగా 2021లో ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ అనే హిందీ సినిమాలో నటించింది.