ఆంధ్రప్రదేశ్రాష్ట్ర సర్పంచ్ల సంఘం న్యూ ఢిల్లీలోని ధర్నా నిర్వహించింది. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు, రాష్గ్ర ప్రధాన కార్శదర్శి బిర్రు ప్రతాపరెడ్డి నేతృత్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇచ్చిన నిధులను నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్పంచ్లకు అప్పచెప్పకుండా.. సైంధవుడిలా అడ్డుపడి దిగమింగాడన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని జగన్ మింగేసిన నిధులను సర్పంచ్లుకు ఇచ్చింది గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
మరోవైపు ఏపీ సర్పంచ్ల ధర్నాపై లోక్సభ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ,రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ స్పందించారు. సర్పంచ్ల సమస్యలు వారి వ్యక్తిగతమైనవి కావనీ వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజల తరఫున పోరాడుతున్నారన్నారు. సర్పంచ్లకు వారి ఉద్యమాలకు అండదండలుగా ఉంటామని, గ్రామీణ ప్రజల సర్పంచ్ల సమస్యల గురించి లోక్సభ, రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఈ విషయం ప్రధానమంత్రి మోడీ దృష్టికి హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రాలో సర్పంచ్లకు, గ్రామీణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని కనకమెడల రవీంద్ర కుమార్, రఘురామ కృష్ణంరాజుగారు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలలోని 3.50 కోట్ల గ్రామీణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులు 2018 – 19 సంవత్సరానికి రూ.1729.23 కోట్లు, 2019 -20 సంవత్సరానికి రూ. 2336.56 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం నిధులు 2020-21 సంవత్సరానికి రూ. 2625 కోట్లు, 2021-22 సంవత్సరానికి రూ. 1939 కోట్లతో కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 8629.79 కోట్లను గ్రామ పంచాయతీలకు కేఠాయించిందని, కానీ సీఎం అవి గ్రామ స్థాయిలో విడుదల చేయకుండా, చెక్కుల మీద సర్పంచ్లు సంతకాలు లేకుండా, సర్పంచ్లకు చెప్పకుండా గ్రామపంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ ఖాతాల నుంచి తమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు సర్పంచ్లు ఆరోపించారు. దీంతో సీఎం జగన్ చేస్తున్న అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. మరోవైపు 2022-23 సంవత్సరానికి రూ. 2010 కోట్లు దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 సంబంధించి రావలసిన రూ. 2031 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దొంగలించే అవకాశం ఉందన్న సర్పంచ్లు.. వీటిని రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా విడుదల చేయాలన్నారు.