Sharmila : ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కు ఆయన సోదరి, ఏపీపీసీసీ(AICC) చీఫ్, కడప(Kadapa) ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ” నవ సందేహాలకు” సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లేఖలో షర్మిల పేర్కొన్న ప్రశ్నలు ఇలా ఉన్నాయి..
1) ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా ?
2) భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగు భూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపి వేశారు ?
3) 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపివేశారు ?
Also Read : జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!
4) ఎస్సీ,ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ?
5) ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకువచ్చిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు ?
6) దళిత, గిరిజన సిట్టింగ్ MLA లకు ఈ సారి ఎందుకు సీట్లు నిరాకరించారు ?
7) SC,ST లపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి..ఇది మీ వివక్ష కాదా ?
8) దళిత డ్రైవర్ ను చంపి…సూట్ కేసు లో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్శిస్తున్నారు ?
9) స్టడీ సర్కిల్స్ కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ?