AP News: జగన్ అండ్ కో ఇంకా తమ పంథా మార్చుకోవట్లేదని ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా వైసీపీ నేతల దారుణాలు ఆగడం లేదని, నిత్యం ఏపీలో ఏదో ఒక మూలన దారుణాలు జరుగుతున్నాయంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన లోకేశ్.. ‘ఫేకు జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా. నీలా నాకు క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు విదేశాలకు వెళ్లాలంటే నీలా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్ళాను. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుండి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది చిల్ బ్రో! సరే కానీ బాబాయ్ ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్?’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.