పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేపడుతూ ముందుకెళ్తోంది బ్రో టీమ్. ‘బ్రో’ మూవీ చూసేందుకు యావత్ సినీ లోకం రెడీ అయింది. జులై 28న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని మెగా ఫ్యాన్స్ కుతూహలంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చాయి. బ్రో సినిమాకు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది. చిత్ర రన్ టైమ్ 2 గంట 14 నిమిషాలని తెలిపారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. బ్రో చిత్రానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. బ్రో టైటిల్ సీక్రెట్ రివీల్ చేస్తూ ఈ సినిమాలో బెస్ట్ సీన్ గురించి చెప్పేశాడు.
ఈ మూవీ మొత్తం కూడా మావయ్య, నేను బ్రో అనే పిలుచుకుంటాం.. అందుకే అదే పేరును టైటిల్ గా తీసుకున్నామని తెలిపాడు. ఈ చిత్రంలో కేతిక శర్మతో బ్రేకప్ సీన్ తర్వాత మద్యం తాగి మావయ్యతో బాధను పంచుకునే సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. ఈ సీన్ తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందని సాయి తేజ్ చెప్పడం విశేషం.
టైమ్ లేదంటూ నిత్యం పరుగులు పెట్టే ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. అయితే ఆ చనిపోయిన మనిషికి ఇంకొన్ని రోజులు బతికేందుకు టైమ్ ఇస్తే ఏం చేశాడన్నదే ఈ బ్రో కథ.ఈ మూవీలో పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్ గా కనిపించనుండగా.. కామన్ మ్యాన్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించారు.
ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమా రీమేక్ గా ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్ డేట్స్ మరింతగా సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఈ సినిమా ఒరిజినల్లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. తెలుగు వర్షన్ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రంతో పోలిస్తే ఇది భారీగా ఉంటుంది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కథలో సోల్ అలాగే ఉంచామని, మాతృక చూసిన వారికి కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని ప్రొడ్యూసర్ తెలిపారు.