Yevam Movie Lyrical Video : టాలీవుడ్ (Tollywood) యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ (Chandini Chowdary), జైభారత్, వశిష్ట సింహా, అషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యేవమ్’. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించారు. సీస్పేస్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో నవదీప్, గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్.
యేవమ్ ఫస్ట్ సింగల్ ‘ఒగ్గు కథ’
యేవమ్ (Yevam) ఫస్ట్ లిరికల్ వీడియో ఒగ్గు కథ పాటను రిలీజ్ చేశారు. తెలంగాణ (Telangana) సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఒగ్గు కథ నేపథ్యంలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాట చూస్తే కథలో జరిగే సన్నివేశాలను, సంఘటనలను ఒగ్గు కథ రూపంలో చెప్పినట్లుగా అర్థమవుతోంది. విలన్ క్యారెక్టర్ ను ప్రతిభింబించేలా పాటలోని లిరిక్స్ ఉన్నాయి.
Also Read: Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే అప్డేట్