Yellow Teeth:మనిషిలో చూడగానే ఆకర్షించేది నవ్వు. నవ్వు అందంగా ఉండాలంటే పళ్ళు తెల్లగా అందంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలంటే నోటి ఆరోగ్యం మంచిగుండాలి. ఈ విషయంలో దంతాలు ప్రధాన రోల్ పోషిస్తాయి. లేకపోతే నోటి దుర్వాసన, దంతక్షయం, దంతాలపై మరకలు వంటి సమస్యలు అధికంగా వస్తాయి. అదే విధంగా రెగ్యులర్‌గా టీ, కాఫీలు తాగేవారు నోరుని ఖచ్చితంగా కడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే నోరు క్లీన్ చేయకపోతే కాఫీ, టీ పళ్ళకి అతుక్కుని దంతాల రంగు మారటానికి అవకాశం ఉంది. దీంతో పాటు ధూమపానానికి కూడా దూరంగా ఉంటే మంచిది. పసుపు రంగులో ఉన్న పళ్ళకు పండ్లు కూరగాయలు ఎక్కువ నీటి శాతం ఉన్నవాటిని తీసుకుంటే దంతాల రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాలో అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ టిప్స్‌ను ఫాలో అయితే దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి. అందుకోసం కొన్ని టిప్స్‌ని ఇప్పుడు చూద్దాం.
దంతాలను తెల్లగా మార్చే టిప్స్
దంతాలు తెల్లగా అవ్వలంటే ఆయిల్ పుల్లింగ్ బాగానే పనిచేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనెను నోట్లో వేసుకోని 10 నుంచి 30 నిమిషాల పాటు అటు ఇటు అంటుకునేలా చేయాలి. ఇలా చేస్తే నోట్లో ఉన్న సూక్ష్మక్రిములు, విషాలు అన్నీ నూనెలో కలిసిపోయాయి. కానీ ఇవన్నీ కడుపులోకి వెళ్ళకుండ ఉమ్మేసి పళ్ళు క్లీన్ చేసుకోవాలి. ఇలా నెలకోసారి చేస్తే దంతాలపై ఉన్న మరకలు పోయి తెల్లగా అవుతాయి.
రెండు సార్లు: రోజుకి రెండు సార్లు పళ్ళు తోముకోవటం ఉత్తమం. దాదాపు చాలామంది ఉదయాన్నే పళ్ళు తోముతారు. అయితే.. రెండు నిమిషాల కంటే ఎక్కువగా బ్రష్ చేయొద్దని దంత వైద్యులు చెబుతున్నారు. రాత్రి కూడా క్లీన్ చేసుకుంటూ దంతాలు పుచ్చిపోకుండా ఉంటుంది. రాత్రి సమయంలో నోట్లో లాలాజలం తక్కువగా ఉంటుంది. కావున నోరు శుభ్రంగా లేకపోతే దంత సమస్యలు వచ్చే చాన్స్ ఉంది.
సాఫ్ట్ బ్రష్: రోజూ ఉదయం బ్రష్ చేయడం అందరూ చేస్తారు. కొందరు అయితే.. పళ్ళను సరిగ్గా తోముకోరు. దీని వలన లేకపోతే దంతాల ఎనామిల్ కోల్పోయి, దంతాల రంగు మారుతోంది. అందుకే.. హార్డ్‌గా ఉండే బ్రష్ వాడకుండా సాఫ్ట్ బ్రష్‌తో రెండు నిమిషాల పాటు బ్రష్ చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read: లూజ్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫ్యాషన్ బాసూ.. ఈ బట్టలతో ఎంతో ఆరోగ్యం కూడా!