YCP Pending Bills: వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లుల లెక్క తేల్చాలని మంత్రి పయ్యావుల అధికారులను ఆదేశించారు. దీంతో వివరాలు సేకరించి వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ప్రతి శాఖకు ఆర్థిక శాఖ లేఖలు పంపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వివరాలను పంపించారు. అయితే ఇప్పటికి పెండింగ్ బిల్లులపై అరకొరగా సమాచారం అందిందని, మొత్తంగా రూ.10 వేల కోట్లు మాత్రమే పెండింగ్ బిల్లులు ఉన్నట్టు ఆర్థిక శాఖ చెబుతుండటంపై పయ్యావుల అభ్యంతరం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం తీసుకోవాలని మరోసారి ఆదేశించారు. మరోసారి పెండింగ్ బిల్లులపై శాఖలకు లేఖలు రాయాలని ఆర్థిక మంత్రి తెలిపారు. లేని యెడల తీవ్రమైన చర్యలు ఉంటాయని లేఖలో పేర్కొనాలని అధికారులకు సూచించారు.