World’s Largest Elevator in Jio World Centre: ఇప్పుడు ప్రతీ బిల్డింగ్‌లో లిప్ట్ ఉండటం చాలా సర్వ సాధారణం అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లో ఇవి ఉంటాయి. మామూలుగా అయితే ఇవి ఒక 20 మహా అయితే 30 మంది ఒకేసారి ప్రయాణించే అంత కెపాసిటీని కలిగి ఉంటాయి. కానీ ముంబయ్ జియో వరల్డ్ సెంటర్లో ఏకంగా ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అంత లిఫ్ట్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ అయిన దీని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లిఫ్ట్‌లో నిల్చో వచ్చును. కూర్చోవచ్చు…కవాలంటే హాయిగా పడుకోవచ్చును కూడా. అదేంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా… అయితే ఈ కింద వీడియో మీద మీరు ఒక లుక్కేసేయండి.
View this post on Instagram
చూశారుగా ఎంత పెద్ద లిఫ్టో. ఈ లిఫ్ట్ 26 చదరపు మీటలర్ల స్థలం కలిగి ఉంది. ఒకేసారి 200మందిని మోసుకుపోగలదు కూడా. ఈ 5 స్టాప్ ఎలివేటర్ ముంబై జియో వరల్డ్ సెంటర్లో (Mumbai Jio World Centre) ఉంది. దీనిలో ఒక ఇంటిలో ఉన్నట్టే సోఫాలు, లైట్లు అన్నీ ఉంటాయి. అంబానీలు (Ambani) తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ లిఫ్ట్ ఒక ఉదాహరణ. ముంబైలో అంబానీ కట్టించిన జియో వరల్డ్ సెంటరే ఒక అద్భుతం. ఇక్కడ అత్యంత పెద్ద ఆంఫీ థియేటర్ కూడా ఉంది. భారతదేశంలో ఉన్న పెద్ద థియేటర్లలో ఇది ఒకటి. ఇప్పుడు ఇందులోనే ఉన్న ఈ పెద్ద లిఫ్ట్ కూడా రికార్డ్ సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్…
ఈ పెద్ద లిఫ్ట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడిమాలో తెగ వైరల్ అవుతున్నాయి. సౌరబ్ బేడీ నే మోడల్ అప్లోడ్ చేసిన వీడియోకి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు దీని కింద బోలెడంత మంది నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. దీన్ని లిఫ్ట్ అనకూడదు పెద్ద గది అనాలి అని ఒకరంటే..ఈ లిఫ్ట్‌కు ఒక ఎలివేటర్ పెట్టాలి అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
నీతా అంబానీ ప్రారంభించిన వరల్డ్ జియో సెంటర్…ఒక కల్చరల్ సెంటర్. ఇది భారతదేశంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రం. దీని ప్రారంభ వేడుకలను కూడా అంబానీ కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహించింది.