Viswam First Strike: టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబోలో రాబోతున్న మూవీ ‘విశ్వం’. కొంతకాలంగా వీరిద్దరికీ హిట్ లేక ఇబ్బంది పడుతుండగా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టి తీర్చి దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఒక టీజర్ విడుదల చేశారు. టీజర్ ఎంట్రీనే గ్రాండ్ గా పరిచయం చేసిన శ్రీను వైట్ల గోపిచంద్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు.
డిఫరెంట్ క్యారెక్టర్..
బ్లాక్ కలర్ డ్రెస్, మంకీ క్యాప్ కప్పుకుని చేతిలో గిటారు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న గోపిచంద్ లుక్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. అంతేకాదు పెళ్లి వేడుకలోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ గిటారు బ్యాగ్ లోంచి గన్ తీసి అక్కడున్న వారందరినీ కాల్చి చంపి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాలో గోపీచంద్ గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ స్ట్రైక్ అయితే బాగానే హైలెట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఒక కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టీజర్ వీడియో వైరల్ అవుతోంది.