Vinesh Phogaat: వినేశ్ ఫోగాట్ విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు తమకు అనుకూలంగా రాలేదని, ఇలాంటి సమయంలో భారత రెజ్లింగ్ సంఘం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ ఆరోపించారు. ఢిల్లీ చేరుకున్న ఫోగాట్‌కు విమానాశ్రయంలో భారీ ఘన స్వాగతం లభించింది.
ఈ క్రమంలోనే సోమ్‌వీర్ ను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. వినేశ్ ఫోగాట్ తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించగా… దానికి ఆయన నుంచి సమాధానం రాలేదు. భారతదేశం మొత్తం ఫొగాట్‌పై అభిమానం కురిపిస్తోందని, దీనిని తాము ఊహించలేదన్నారు. సహచరుల నుంచి కూడా మంచి మద్దతు లభించిందన్నారు.
ఇంతటి అభిమానం కురిపిస్తున్నందుకు మాటలు రావడం లేదు. సంతోషంతో మనసు నిండిపోయింది. కొద్దిలో పతకం చేజారిందని… ఆ తర్వాత సీఏఎస్లోనూ మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రెజ్లింగ్ సంఘం అండగా నిలబడలేదని తెలిపారు.
Also Read: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు!