నందమూరి హీరో బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసింది. అందరిలాగే తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని, ఓ సినిమాలో నటిస్తున్నపుడు హీరో తనను రూమ్ కు రమ్మని పిలిచాడంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం విచిత్ర మాట్లాడిన వీడియో వైరల్ అవుతుండగా ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Popular Actress and Tamil Biggboss S7 Contestant #Vichitra shares her shocking and personal bitter experience while shooting for her Tamil film years ago!#BiggBossTamil7 #BiggBossTamil #Vichithra #MeToo @Chinmayi pic.twitter.com/1RJimK0sag
— Akshay (@Filmophile_Man) November 21, 2023
విషయానికొస్తే.. ప్రస్తుతం విచిత్ర బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్‌గా అలరిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్లో భాగంగా తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ విచిత్రను అడిగారు. దీంతో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన నటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీలతోపాటు నేను గిరిజన యువతి పాత్రలో నటించాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ (Casting couch) వేధింపులను ఎదుర్కొన్నాను. చిత్రీకరణ మళంపుజ అడవుల్లో జరిగింది. ఆ సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ మాకు నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ ముగిసిన తర్వాత సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన రూమ్ కు రమ్మని అడిగాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Also read : దానివల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.. అనన్యాపాండే
అయితే ఆ ఒక్కరోజుతోనే కాకుండా మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటినుంచి తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఈ అనుభవంతోనే సినిమాలమీద ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. అయితే ఈ వీడియోలో బాలయ్య పేరును విచిత్ర ఎక్కడ వెల్లడించలేదు. కానీ తన చివరి చిత్రం ‘భలేవాడివి బాసూ’ అని చెప్పడంతో ఆ హీరో బాలయ్యే అంటూ కొంతమంది వాదిస్తున్నారు. మరికొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న బాలయ్య ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, ఆమె వార్తల్లో నిలిచేందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని తిట్టిపోస్తున్నారు.