Nani : వేణు యేల్దండి (Venu Yeldandi) ఈ పేరు కంటే కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో బలగం వేణు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతకు ముందు వరకు వేణు ఎన్నో సినిమాల్లో కామెడియన్ గా చేసి మంచి గుర్తింపునే పొందాడు. కానీ బలగం సినిమాతో ఒక్కసారిగా అతని లెవలే మారిపోయింది. అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని నిర్మాత దిల్ రాజుకి వినిపించడంతో ఆ కథ దిల్ రాజు (Dil Raju) కి తెగ నచ్చడంతో వెంటనే సినిమా చేసారు. అలా వచ్చిన సినిమానే “బలగం”.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కుటుంబంలోని బంధాలను గురించి దర్శకుడు వేణు ఎంతో ఎమోషనల్ గా వివరించాడు .ఈ సినిమాతో వేణుకి ఊహించని క్రేజ్ వచ్చేసింది. ఎందరో సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూసి దర్శకుడు వేణుని ప్రశంసించారు.ఇదిలా ఉంటే వేణు టాలెంట్ చూసిన దిల్ రాజు నేచురల్ స్టార్ నాని (Nani) తో తన రెండో సినిమాను లాక్ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా వేణు ఓ స్టోరీని సిద్ధం చేసుకొని నానికి వినిపించగా వేణు చెప్పిన స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చలేదంట…దీంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.అయితే ఈ స్టోరీకి “ఎల్లమ్మ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.