Suresh Productions : తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోలు, యువ హీరోలు, నిర్మాతలు ఇలా చాలామంది ఇప్పటికే భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా ఈ లిస్ట్ లో దగ్గుబాటి వెంకటేష్, రానా సైతం చేరారు. సురేష్ ప్రొడక్షన్ తరుపున వెంకటేష్, రానా ఇద్దరూ తెలుగు రాష్ట్రాల వరద బాధితుతులకు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకటేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు.
Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger. pic.twitter.com/Hz73oFNkYf
— Venkatesh Daggubati (@VenkyMama) September 6, 2024
Also Read : టాలీవుడ్ లో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన వాళ్ళను చూసి మా హృదయం తల్లడిల్లిపోతోంది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.కోటి విరాళంగా ఇస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తొలిప్రేమ, రంగ్ దే, సార్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి సైతం వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.
వరద బాధితుల సహాయార్థం యువ దర్శకుడు, రచయిత వెంకీ అట్లూరి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం తన ఉదారత చాటుకున్న #VenkyAtluri గారికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు కృతజ్ఞతలు తెలిపారు. #TelanganaFloodRelief #CMRF pic.twitter.com/0PdfbaHI41
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) September 6, 2024