తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం ఉదయం 9గంటలకు ప్రగతి భవన్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరనున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ కు ఉదయం 9గంటల 40 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల పార్థివ దేహానికి నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంతిమ యాత్రలో పాల్గొంటారు. తిరిగి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా 10 :30 నిమిషాలకు బయలుదేరి 11:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకుంటారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్లో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య..!!
కాగా రాష్ట్ర రోడ్లు భవనాశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ గురువారం మరణించారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మంజులమ్మకు గతంలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత కోలుకున్న ఆమె…మళ్లీ అనారోగ్యం బారిన పడింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంజులమ్మ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ తోపాటు , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్…కేవల రూ. 50 కడితే చాలు..జాబ్ గ్యారెంటీ..!!