Vijay Devarakonda In Dual Role : రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అతని పుట్టిన రోజున ఆ సినిమాల అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో ‘VD14’ కూడా ఒకటి. ‘టాక్సీ వాలా’ మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
‘ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. బీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్ కథను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ఆ పోస్టర్ లో ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ రిస్క్ చేయనున్నట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది.
Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం!
ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో
‘VD14’ మూవీలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఏకంగా యుద్ధ వీరుడిగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటించింది లేదు.
అదికూడా యుద్ధ వీరుడి పాత్ర చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకొని చాలాకాలం అవుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోతున్నాయి. ఇలాంటి టైం లో విజయ్ దేవరకొండ పీరియాడిక్ స్టోరీ ఎంచుకొని ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. మరి రౌడీ హీరోకి డ్యూయల్ రోల్ కలిసొస్తుందేమో చూడాలి.
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024