Mega Brothers: మెగా బ్రదర్స్.. సినిమా ఇండస్ట్రీలో.. ప్రజా క్షేత్రంలో వీరు ఓ స్పెషల్ ఐకాన్స్. ఎవరి అండాలేకుండా సినిమాల్లోకి వచ్చి స్వశక్తితో మెగాస్టార్ రేంజ్ సంపాదించుకుని.. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రపంచంలో స్టార్ గా తనదైన ముద్ర వేస్తున్నారు చిరంజీవి (Chiranjeevi). అన్న ఇచ్చిన సహకారంతో.. అంచెలంచెలుగా నటుడిగా, ప్రొడ్యూసర్ గా తనదైన స్టైల్ లో నిలబడ్డ నాగబాబు (Nagababu).. అన్న అడుగుజాడల్లో సినీ హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఒక ఇమేజ్ సృష్టించుకుని.. అన్న వదిలి పెట్టేసిన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగా కోట్లాది మంది అభిమానులే అండగా ముందుకు తీసుకువెళుతున్న పవర్ ప్యాక్డ్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. వీరు ముగ్గురూ ఒకచోట కలిసి కనిపించడం చాలా అరుదు. ఎక్కువగా తమ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనే వీరు కలిసి కనిపిస్తారు. అలా మరో ఫంక్షన్ వీరి ముగ్గురినీ ఒక దగ్గరకు చేర్చింది. అది నాగబాబు కొడుకు.. సినీహీరో వరుణ్ తేజ్ వివాహం (Varun Tej Marriage) వేడుక. ఇటలీలో ఈ నెల ఒకటో తారీఖున సినీ నటి లావణ్య త్రిపాఠీతో (Lavanya Tripati) వరుణ్ వివాహం కొద్దిమంది బంధు మిత్రుల మధ్య కోలాహలంగా ఆ జరిగింది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్ళింది.
Also Read: “డ్యూయెట్” తో ఆనంద్ దేవరకొండ..!
ఈ నేపథ్యంలో ఈ మెగా బ్రదర్స్ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో ఇన్స్టా లో షేర్ చేశారు నాగబాబు. మా బంధం ప్రత్యేకమైనది అని చెబుతూనే.. అన్నదమ్ముల మధ్య బంధం గురించి తనదైన స్టైల్ లో క్యాప్షన్ ఇచ్చారు. అభిప్రాయం బేధాలు ఉండవచ్చు.. కానీ.. అన్నదమ్ములుగా మా బంధం వాటికీ అతీతమైనది. ప్రేమతో కూడిన ప్రత్యేక బంధం ఇది అంటూ అయన ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింటిలో ట్రేండింగ్ గా మారింది. నెటిజన్లు మంచి కామెంట్స్ తో మెగా బ్రదర్స్ బంధాన్ని పొగుడుతున్నారు. పెర్ఫెక్ట్ ఫిక్చర్ అంటూ షేర్లతో.. ట్రెండ్ చేస్తున్నారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి పక్కకు జరిగి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తరువాత పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి.. రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆయనతో పాటు పార్టీ ప్రచారంలో తిరిగారు. పవన్ కళ్యాణ్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య విబేధాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరిగింది. తరువాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆయనకు వెన్నుదన్నుగా నాగబాబు వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ, చిరంజీవి మాత్రం జనసేన వేపు చూడలేదు. పార్టీకి ఏ రకంగానూ మద్దతు ప్రకటించలేదు. పైగా కొన్ని సందర్భాలలో జనసేన పార్టీ శత్రువుగా భావించే వైసీపీ నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ మధ్యలో అభిప్రాయ బేధాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే వాదనలు వెలువడ్డాయి. ఇప్పటికీ చాలా మంది అదే భావిస్తూ ఉంటారు.
Also Read: జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు!
ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేస్తూ నాగబాబు తమ మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ స్పష్టంగా గట్టి మెసేజ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఏది ఏమైనా నాగబాబు చెప్పింది కూడా నిజమే కదా.. అభిప్రాయ బేధాలు.. అన్నదమ్ముల అనునుబంధాన్ని విడదీయవుగా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇది స్పెషల్ ఫోటో అంటూ సంబరపడిపోతున్నారు. మీరు కూడా నాగబాబు పోస్ట్ ఇక్కడ చూసేయండి.
View this post on Instagram