Actress Ananya Nagalla About Cyber Crime : తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె..సైబర్ నేరగాళ్ల మోసాన్ని బయటపెట్టింది. తాజాగా వాళ్ళ ద్వారా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అసలేం జరిగిందో వివరించింది.
జైలు శిక్ష పడుతుందని బెదిరించారు…
‘నా పేరుతో సిమ్ తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఫోన్ చేశారు. మీ పేరుతో ఉన్న నంబర్ ద్వారా కొందరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారు. ముంబయిలోని ట్రాయ్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ నంబర్‌పై దాదాపు 25 వరకు మనీలాండరింగ్ లావాదేవీలు జరిగాయి.. మీకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. కొద్దిసేపు వీడియో కాల్ ఆన్‌లో ఉంచి.. ఆ తర్వాత ఆఫ్ చేశారు. దీనిపై మీరు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయండి.. అని వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయి నన్ను నమ్మించేందుకు కొన్ని డాకుమెంట్స్ చూపించారు.
Also Read : అయ్యో పాపం జేజమ్మ.. అనుష్క అతిగా నవ్వితే అంతేనట!
జాగ్రత్తగా ఉండాలి…
ఆర్బీఐకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలని నన్ను అడిగారు. ఆ తర్వాత నాకు థర్డ్ పార్టీ అకౌంట్ నంబర్ పంపి డబ్బులు బదిలీ చేయాలని కోరాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చి.. నేను అతన్ని నిలదీశాను. దీంతో అతనే నాపై తిరిగి గట్టిగా మాట్లాడాడు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానడంతో వీడియో కాల్ కట్ చేశాడు’ అని తెలిపింది. ఇలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అనన్య నాగళ్ల సూచించారు. దయచేసి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అనన్య ఈ వీడియోలో పేర్కొంది.