F1 visa slots : ఉన్నత చదువులకు అమెరికా(America) కేరాఫ్. ఇటు హయ్యర్ స్టడీస్ అభ్యసించాలనుకునే భారతీయులకు కూడా సెంటర్ పాయింట్ అమెరికా. అక్కడికి వెళ్లి చదువుకోవాలన్నది చాలా మంది కల. అయితే వీసా రిజెక్షన్ అన్నది చాలా పెయిన్ఫుల్. కాస్త లక్ కూడా ఉండాలి లేకపోతే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరే.. ముఖ్యంగా F1 వీసా రిజెక్షన్స్ ఎక్కువ. గతంలో వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్లకి గుడ్‌న్యూస్. గతంలో తిరస్కరణను ఎదుర్కొన్న హైదరాబాద్‌కు చెందిన F1 వీసా(F1 Visa) దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విషయం ఇది. ప్రస్తుతం F1 వీసా స్లాట్స్ (F1 visa slots)దేశవ్యాప్తంగా ఓపెన్ అయ్యాయి.
F1 వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యాయని తెలియగానే అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే వారు దరఖాస్తుకు క్యూ కడుతున్నారు. వీరిలో గతంలో మూడు, నాలుగు సార్లు వీసా పొందడంలో విఫలమయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ అవకాశం కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నామని, ఈసారి F1 వీసా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశం అంతటా వివిధ కాన్సులేట్లలో స్లాట్లు తెరుచుకున్నాయి. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లేందుకు F1 వీసా అవసరం. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి విద్యార్థులకు ఐదు సంవత్సరాల కాలానికి F1 వీసా ఇస్తారు.
నిజానికి హైదరాబాద్‌లో స్లాట్స్ లేకపోవడంతో చాలా మంది F1 వీసా కోసం చెన్నై వెళ్లేవారు. ముఖ్యంగా గతేడాది జూలై తర్వాత వీసాలు ఆమోదించని వారి కోసం ఢిల్లీ లేదా చెన్నైకి వెళ్లవలసి వచ్చేది. దేశవ్యాప్తంగా చాలా మంది అక్కడికే వెళ్లేవారు. దీంతో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉండేది. చాలా మంది వీసాలు రిజెక్ట్ అవుతుండేవి. ఇలా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడ వీసా రిజెక్ట్ అవ్వడం సంబంధిత విద్యార్థులను చాలా బాధపెట్టేది. ఇదే సమయంలో F1 వీసా దరఖాస్తుదారుల కోసం కన్సులేట్లు తెరుచుకోవడంతో అమెరికి వెళ్లి మాస్టర్స్ చదవాలనుకునే వాళ్లు ఎగిరి గంతేస్తున్నారు. మరోవైపు దరఖాస్తుదారుల కోసం మరిన్ని స్లాట్లను తెరవడాన్ని పరిశీలించాలని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌ను కోరుతున్నారు విద్యార్థులు. F1 వీసా అంటే గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం, సెమినరీ, కన్సర్వేటరీ, అకడమిక్ హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్ లేదా ఇతర విద్యాసంస్థలలో ఫుల్ టైమ్ స్టూడెంట్‌గా అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. F1 వీసా 5 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. F1 వీసా కింద అమెరికా వెళ్లిన విద్యార్థులు కాలేజీలోకి జాయిన్ అయ్యే 30రోజుల ముందే యూఎస్‌కి చేరుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత గరిష్టంగా 60 రోజుల పాటు ఉండొచ్చు.