UNESCO Declares Gujarat’s Garba As Intangible Cultural : గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బా (Garba)కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఙానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO) గర్బాను డిసెంబర్ 6న తన జాబితాలో చేర్చుకుంది. దీంతో గుజరాత్ నుంచి ఈ నృత్యం ఎంపిక కావడంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇది గుజరాత్ ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి పశ్చిమబెంగాల్ లోని కోల్కతా దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇప్పుడు తాజాగా గర్బా నృత్యానికి ఈ గుర్తింపు లభించింది. గర్బాకు లభించిన ఈ అరుదైన గుర్తింపు పై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
Garba is a celebration of life, unity and our deep-rooted traditions. Its inscription on the Intangible Heritage List showcases to the world the beauty of Indian culture. This honour inspires us to preserve and promote our heritage for future generations. Congrats for this global… https://t.co/9kRkLZ1Igt
— Narendra Modi (@narendramodi) December 6, 2023
భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చూపించేందుకు ఇది గొప్ప అవకాశమని..మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. గర్బా అనేది జీవితం, ఐక్యత మరియు మన లోతైన సంప్రదాయాల వేడుక అని పేర్కొన్నారు.
Also read: తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!
” అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్బా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్దిల్లుతోంది. గుజరాత్ కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు గర్వకారణమని” ముఖ్యమంత్రి పేర్కొన్నారు.