Ugadi 2024
Happy Ugadi 2024 Wishes : క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.!
Happy Ugadi 2024 Wishes : ఉగాది(Ugadi) అంటేనే తెలుగు ప్రజల పండుగ. ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం(Telugu New Year) ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండగను ప్రతి ఏడాది మార్చి చివరి వారంలో ఏప్రిల్ మొదటివారంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజు పంచాంగంలో భాగంగా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితులు రాశిఫలాలు(Zodiac Signs) కూడా తెలుసుకుంటారు. అలాగే ఉగాది నాడు హిందువులంతా ఎంతో ప్రామఖ్యత కలిగిని పిండివంటలతో పాటు ఉగాది పచ్చడిని తింటారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కళకళలాడుతుంటాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉగాది పండగ ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీప్రియమైనవారికి ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.
1. అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
2. తీపి, చేదు కలిసిందే జీవితం..
కష్టం,సుఖం తెలిసిందే జీవితం..0
ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుు వస్తుంది ఉగాది పర్వదినం
శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
3. మధురమైన ప్రతిక్షణం, నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
4. కష్టసుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం, అదే ఉగాది పచ్చడి తెలియచెప్పే నిజం
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
5. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2024 ఉగాది శుభాకాంక్షలు..
6. యుగాది గడిచిపోయినా
ఉగాది తిరిగి వచ్చింది
కొత్త సంవత్సరం
కొత్తదనాన్ని తెస్తుంది.. ఉగాది శుభాకాంక్షలు.
7. ఈ నూతన సంవత్సరం ఉగాది మీకు సంతోషం, శాంతి, శ్రేయస్సును ప్రసాదించుగాక.. ఉగాది శుభాకాంక్షలు 2024..
8. లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన కోయిల రాగాలు, అందమైన ముగ్గులు
కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలు, ఉగాది పండుగ సంబరాలు ఎన్నో
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.
ఇది కూడా చదవండి : ఉగాది నాడు ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టలక్ష్మీ తలుపు తట్టడం ఖాయం.!
Ugadi 2024: ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆనవాయితీ.. అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసా?
Ugadi Panchangam 2024: ఉగాది అనగానే వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. తెలుగువారి కొత్త ఏడాది ప్రారంభం అయిన మొదటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం షురూ కాబోతోంది. ఉగాది రోజు పంచాంగం వినడం తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చోని పంచాంగం వినాలని సిద్ధాంతులు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశిఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చెబుతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: ఆ నాలుగు కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజిస్ట్రేషన్లు రద్దు!
పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ ఏడాది ఫలితాలను వివరిస్తారు. గత కొంతకాలం వరకు రైతులు తాము పండించే పంటలు ఎలా ఉండనున్నాయి. ఏరువాక ఎలా సాగుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకుంటుండేవారు. అంతేకాదు శుభకార్యాలకు ముహుర్తం పెట్టడం కోసం, పూజాదికార్యక్రమాలు వంటి అనేక విషయాలను తెలుసుకునేందుకు పంచాంగాన్ని ఉపయోగిస్తారు. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి..మళ్లీ కొత్త ఏడాది ముందురోజు వరకు అమల్లో ఉంటుంది.
తెలుగు సంవత్సరంలో ఏఏ గ్రహాలకు ఏఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ ఏడాది నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంగములు కలది కాబట్టి పంచాంగం అంటారు. మానవుల జీవితాల కాలంపైన కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉంటుంది. గ్రహాల సంచారంపై జ్యోతిషశాస్త్రం ఆధారపడుతుంది. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుంది. వీటికి పంచాంగమే ప్రమాణము.
ఉగాది రోజు సాయంత్రం దేవాలయాల్లో లేతా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి. జ్యోతిష శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు. కొత్త సంవత్సరంలో తాము తీసుకోవల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగినట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
Ugadi 2024: ఉగాది నాడు ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టలక్ష్మీ తలుపు తట్టడం ఖాయం.!
Ugadi 2024: హిందూ నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. అందుకే, హిందూమతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి.. కొత్త బట్టలు ధరించి పచ్చడి తిని ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇంట్లో దేవుళ్లతోపాటు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.హిందూ నూతన సంవత్సరం అంటే ఉగాది రోజున ఇంట్లోని ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ 5 ప్రదేశాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర:
హిందూ నూతన సంవత్సరం మొదటి రోజు అనగా ఉగాది పండుగ సాయంత్రం నెయ్యి దీపాలను మీ ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. దీనితో మీరు ఏడాది పొడవునా మంచి ఫలితాలను పొందుతారు. మీరు సంధ్యా సమయంలో లేదా సాయంత్రం దీన్ని చేయాలని గుర్తుంచుకోండి.
దగ్గరలో ఉన్న గుడిలో:
ఉగాది, హిందూ సంవత్సరాది రోజున, మీరు మీ ఇంటి పూజా గదిలో మాత్రమే దీపం వెలిగించాలి. అంతేకాదు మీ ఇంటికి సమీపంలోని ఏదైనా ఆలయంలో కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన లేదా సగంలో ఆగిపోయిన మీ పనులన్నీ పునఃప్రారంభించబడతాయి.మీరు ఈ పనిలో విజయం సాధిస్తారు.
తులసి ముందు దీపం వెలిగించండి:
ఉగాది పండుగ రోజు సాయంత్రం తులసి మొక్క కింద స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి. హిందూమతంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైన, స్వచ్ఛమైన మొక్కగా పరిగణిస్తారు. ఈ మొక్కను పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు.
బావి దగ్గర:
మీరు మీ ఇంటి బావిపై లేదా మెట్టు బావిపై లేదా మీ ఇంటికి సమీపంలోని ఏదైనా బావిపై మరచిపోకుండా దీపం వెలిగించాలి. ఈ ప్రదేశం దేవతల నివాసంగా నమ్ముతారు. ఈ ప్రదేశంలో దీపం వెలిగిస్తే మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి.
వంటగది ఇల్లు:
ఉగాది పండుగ రోజున మీ ఇంట్లోని వంటగది గదిలో తప్పకుండా దీపం వెలిగించాలి. ఉగాది నాడు ఇక్కడ దీపం వెలిగించడం ద్వారా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అపారమైన అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఏడాది పొడవునా డబ్బు, ధాన్యానికి సంబంధించిన ఎలాంటి కొరత లేదా సమస్యలను ఎదుర్కోలేరు.
ఇది కూడాచ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్..!
Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.!
Ugadi Festival 2024 : భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఒక ఏడాదిలో ఎన్నో రకాల పండగలు వస్తుంటాయి. ఆ పండగల రోజున ఆ పండగకు సంబంధించిన దేవుళ్లను, దేవతలను ప్రత్యేకంగా పూజించడం, తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఆచారం. ఈ క్రమంలో తెలుగువారంతా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఉంది. సంవత్సరం ఆరంభంలో వచ్చే ఈ పండుగ అంటే ఎంతో మంది ఇష్టపడతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఉగాది(Ugadi) రోజున కొత్త సంవత్సరం(New Year) ప్రారంభమైనట్లు భావించడం.. అనాదిగా వస్తోన్న ఆచారం. ఉగాది కంటే ముందుగా అందరికీ.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. అలాగే ఉగాది రోజు చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుంది. అయితే ఉగాది రోజు ప్రత్యేకించి ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?
ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి స్రుష్టి మొదలైందని నమ్ముతుంటారు. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తువులు ధరించి గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలకు కడుతారు. ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండక్కి కాలమే దైవం. కాబట్టి ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అనంతరం వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి(Ugadi Pachadi) ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవి(Summer) లో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీవిత కష్ట సుఖాల కావడి కుండలు అని చెప్పడమే.
ఇది కూడా చదవండి: ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Ugadi Pachadi : ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Ugadi 2024 : ప్రతి సంవత్సరం ఉగాది(Ugadi) పండుగ చైత్ర శుక్ల పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఇంకో రెండు రోజుల్లో మనమంతా తెలుగు కొత్త సంవత్సరం ‘క్రోధి’ నామ సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఉగాది రోజున అందరి ఇళ్లలో ఉగాది పచ్చడి(Ugadi Pachadi) ఖచ్చితంగా ఉంటుంది. ఈ పండుగ స్పెషల్ యే పచ్చడి. ఈ పచ్చడి కేవలం ఆనావాయితీగానే చేసుకుంటూ వస్తున్నాము. మన పండుగలు.. వాటి ప్రత్యేకత వెనుక ఎంతో సైన్స్ దాగుందన్న విషయం మీకు తెలుసా. అవును పండుగలకు మనం చేసుకుని తినే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎన్నోఆరోగ్య రహస్యాలను దాగి ఉన్నాయి. ఉగాది నాడు పచ్చడి తాగితే మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయో తెలుసుకుందాం.
తీపి, కారం, పులుపు, వగరు, చేదు, వంటి పదార్థాలతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. మరి ఈ షడ్రుచుల సమ్మేళనం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు సంవత్సరం పొడుగునా మన కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్నా భావాన్ని ఇస్తుంది. శాస్త్రీయంగా తయారు చేసిన ఈ పచ్చడిని శ్రీరామన నవమి వరకు తాగాలని పురాణాలు చెబతున్నాయి. ఇక ఉగాది రోజున పచ్చడి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా.
వేప:
వేపపువ్వు(Azadirachta Indica) మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. రుతువు మారడంతో అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమ్మవారు, మలేరియా, కలరా వంటి వ్యాధులు పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి వేపపూత దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో వ్యాధినిరోధక గుణాలున్నాయి. అంతేకాదు ఇందులో యాంటీ వైరస్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే పండుగలప్పుడు మర్చిపోకుండా గుమ్మాలకు వేపమండలను కడుతుంటారు. గుమ్మాలకు వేపమండలను కట్టడం వల్ల క్రిమికీటకాలు ఇంటిలోపలికి వెళ్లవని నమ్ముతుంటారు.
బెల్లం:
తీపి.. ఉగాది వేడుకకు ప్రతీక. బెల్లం(Jaggery) నుండి తీపి వస్తుంది. ఇది జీర్ణకోశ, మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తహీనతను తొలగిస్తుంది. శరీరంపై సానుకూల ప్రభావం చూపుతుంది. సహజంగా తీయగా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదేవిధంగా, ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది.
మామిడికాయ:
ఉగాది పచ్చడిని పులుపు చేసేది మామిడికాయ(Mango). మామిడి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, డీహైడ్రేషన్, వడదెబ్బను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పులుపు:
ఉగాది పచ్చడిలో చింతపండు పుల్లగా ఉంటుంది. చింతపండు కడుపు సమస్యలను నయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చింతపండు గుజ్జును ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి, నిర్విషీకరణ చేయడానికి ఉపయోగిస్తారు. మామిడిపండ్లు డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. మార్నింగ్ సిక్నెస్తో సంబంధం ఉన్న వికారాన్ని తగ్గిస్తాయి. గుండె, కాలేయం, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. స్కర్వీని నయం చేస్తుంది.
ఉప్పు:
ఉగాది పచ్చడిలో ఉండే ఉప్పు వాతాన్ని, వాతాన్ని నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది శరీరంలో సోడియం నష్టాన్ని భర్తీ చేస్తుంది. డీహైడ్రేషన్, ఆర్థరైటిస్ సమస్యను సరిదిద్దడం. సోడియం మూలంగా ఉండటం వలన, ఇది నిర్జలీకరణాన్ని నిరోధిస్తుంది, ఐరన్ కంటెంట్‌ను సమతుల్యం చేస్తుంది. ద్రవం నిలుపుదలని నియంత్రిస్తుంది. దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మెదడు పనితీరును సులభతరం చేస్తుంది.
కారం:
కారం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది కూడా పరిమితిలోనే తీసుకోవాలి. కారం వల్ల మన శరీరంలో ఉండే క్రిమి కీటకాలు నశిస్తాయి.ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఊపిరితిత్తులకు ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి : క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?