Kakinada: కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో సామాన్య ప్రయాణికుడిలా కనిపించారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. రైలులో విజయవాడ వెళ్లేందుకు సతీమణితో తుని రైల్వే స్టేషన్కు వెళ్లారు. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సెల్ఫీలు దిగారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా రైలెక్కిన అయ్యన్నపాత్రుడిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనూ తన భార్యతో కలిసి తుని రైల్వే స్టేషన్ నుంచి ఇలాగే ప్రయాణించడం విశేషం.